Listen to this article

జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ మహమ్మద్ రహంతుల్లా వారి ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్ నేషన్ అనే అంశంపై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముమ్మిడివరం కోర్టు కాంపౌండ్ నుండి మెయిన్ రోడ్ మీదగా ఎయిమ్స్ కాలేజీ వరకు ర్యాలీ చేయడం జరిగింది. అనంతరం జడ్జిగారు మాట్లాడుతూ ప్రజలు మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉండాలని కోర్టులోని పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ మధ్యవర్తిత్వంలోకి సివిల్ కేసులు, మరియు క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ మధ్య వర్తిత్వ మూలంగా కక్షిదారుల సమయం మరియు ఖర్చులు ఆదా అవుతాయని మరియు మధ్యవర్తత్వం పూర్తిగా ఇరు వర్గాలకు అనుకూలమైందని అంతేకాకుండా మధ్యవర్తత్వం అంటే ఇద్దరు గెలుపు అని తెలియజేశారు. స్నేహపూర్వక వాతావరణం లో కేసులను పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వడ్డీ నాగేశ్వరావు గారు, ఏజీపీ శ్రీ కాశి సిద్ధార్థ కుమార్ గారు, మీడియేషన్ అడ్వకేట్సు, ప్యానల్ అడ్వకేట్స్, బార్ అసోసియేషన్ అడ్వకేట్,కోర్టు సిబ్బంది, ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ , ముమ్మిడివరం ఎస్సై జ్వాల సాగర్ , కాట్రేనికోన ఎస్సై, ఐపోలవరం ఎస్సై ,పోలీసు వారు, పారా లీగల్ వాలంటరీ తదితరులు పాల్గొన్నారు.