Listen to this article

జనం న్యూస్:16 జులై బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్

;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం – సిద్దిపేట
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్, రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్, మరియు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన సైన్స్ ప్రాయోగిక పరీక్షలు తేదీ 17-07-2025 నుండి 26-07-2025 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో నిర్వహించబడుతాయని ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రద్ధానందం ఒక ప్రకటనలో తెలిపారు.
అందువలన విద్యార్థులు తమ కళాశాల గుర్తింపు పత్రం, ప్రవేశ పత్రం వెంట తీసుకొచ్చగలరని సూచించారు. ఇతర వివరాలకు ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటను సంప్రదించవచ్చు. సంప్రదించుటకు ఫోన్ సంఖ్య: 7382 929615.
[6:15 PM, 7/16/2025] Bg: .