Listen to this article

జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణం ట్యాంకు బండ్ రోడ్డులో ఎలసి బిల్డింగ్ సమీపంలో 1వ పట్టణ పోలీసులు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎపి 39 ఎంయు 6259 నెంబరు గల ఆటోలో ఒడిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేదుకు తీసుకువస్తున్న 46కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 7గురు నిందితులను అరెస్టు చేసినట్లు, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందుతుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 17న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – జూలై 17న విజయనగరం 1వ పట్టణ పోలీసులకు పట్టణంలో గల ట్యాంకుబండ్ రోడ్డులో ఎల్ఐసి ఆఫీసు సమీపంలో ఒక ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు 1వ పట్టణ పోలీసులు ట్యాంకుబండ్ రోడ్డులో ఎపి 39 ఎము 6259 నెంబరు గల ఆటోను తనిఖీ చేయగా సదరు ఆటోలో బ్యాగుల్లో 46 కేజీలు గంజాయి పేకట్లు ఉన్నట్లు గుర్తించి, గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వక్తులను (ఎ-1) ఎఎస్ఆర్ జిల్లా డుంబ్రిగూడ మండలం, పదాల్పుట్ గ్రామానికి చెందిన చందక శ్రీను (28సం.లు) (ఎ-2) ఎఎస్ఆర్ జిల్లా, హుకుంపేట మండలం, సిమిలిగూడ రంగశీల పంచాయితీకి చెందిన చొంపి దివాకర్ (22సం.లు) (ఎ-3) ఎఎస్ఆర్ జిల్లా, హుకుంపేట మండలం, సిమిలిగూడ రంగశీల పంచాయితీకి చెందిన చొంపి కళ్యాణ్, (24 సం.లు) (ఎ-4) ఎఎస్ఆర్ జిల్లా దుంబ్రిగూడ మండలం, కొర్రా గ్రామానికి చెందిన తంగుళ కిరణ్ కుమార్ (21 సం.లు) (ఎ-5) ఎఎస్ఆర్ జిల్లా, హుకుంపేట మండలం, సిమిలిగూడ రంగశీల పంచాయితీకి చెందిన చొంపి సన్యాసిరావు (20 సం.లు) (ఎ-6) కాకినాడ జిల్లా శంఖవరం మండలం, గౌరంపేట గ్రామానికి చెందిన పిల్లా శివ (24సం.లు) (ఎ-7) కాకినాడ జిల్లా పరమలయ్యపేట గ్రామానికి చెందిన పిల్లా కమాలాకర్ (22సం.లు) అనే ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, ఆటోలో తీసుకువెళ్తున్న 46కిలోల గంజాయి, ఆటో, ఒక పల్సర్ బైక్ ను, 5 సెల్ ఫోన్లు, 8 వేలు నగదును సీజ్ చేసారన్నారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా పెదబయలకు చెందిన చందక శ్రీను గంజాయిని ఆటోలో విజయనగరంకు తీసుకువచ్చి అక్కడ నుండి కాకినాడకు చెందిన (ఎ-6) (ఎ-7) ద్వారా హైదరాబాద్కు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు వారికి ముందు పైలట్గా నిందితుడు (ఎ-1) చందక శ్రీను అనే వ్యక్తి వెళ్ళినట్లు, సదరు వ్యక్తి తమను గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదిర్చినట్లు, అందుకు ఒక్కొక్కరికి రూ.3వేలు ఇచ్చినట్లుగా వెల్లడించారన్నారు. పరారైనన నిందితుడు ఎఎస్ఆర్ జిల్లా పెదబయలుకు చెందిన రాంబాబును అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
గంజాయి అక్రమ రవాణను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కారకులైన వారిని కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులను అక్రమంగా కూడబెడితే వారి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా నేరాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన ముగ్గురు నిందితులకు చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ కేసులో క్రియాశీలకం గా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, విజయనగరం 1వ పట్టణ ఇన్స్పెక్టరు ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఎస్ఐలు బి.సురేంద్ర నాయుడు, డి.రామ్ గణేష్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.