

జనం న్యూస్ జులై 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
శేర్లింగంపల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్లో విద్యార్థుల క్యాబినెట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నాయకులను ఎన్నిక చేసుకొని, నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎ జి యమ్ వేణుగోపాల్ యస్ ఐ మనేమియా, మరియు హెడ్ కానిస్టేబుల్ మంచూరల్ హాజరయ్యారు.ఎ జి యమ్ వేణుగోపాల్ మాట్లాడుతూ,
“విద్యార్థులంతా మంచి ప్రవర్తనతో, కొత్త ఆలోచనలతో ప్రతి రంగంలో ఎదగాలి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా సంతరించుకోవాలి. భవిష్యత్తులో నాయకులుగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. యస్ ఐ మనేమియా మాట్లాడుతూ “దేశానికి అవసరమైన నాయకత్వ గుణాలు విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో, బాధ్యతతో ముందుకు సాగాలి” అని సందేశం ఇచ్చారు.హెడ్ కానిస్టేబుల్ మంచూరల్ కూడా విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్వేతా మెడమ్ మాట్లాడుతూ,”ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందుతాయి. సమాజంలో వారి పాత్ర గురించి అవగాహన కలుగుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణ సార్, వైస్ ప్రిన్సిపాల్ కవితా, ఏ.ఓ. రోహిత్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు.
