Listen to this article

జనంన్యూస్జూలై 20:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలకేంద్రంలోరజక బిడ్డల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలేశ్వర స్వామి ఉత్సవాలను రజక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రం ఏర్గట్ల లో స్థానిక రజక సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా బోనాలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజాలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. వర్షలు సమృద్దిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిమాణిక్యం అశోక్, మునిమణిక్యం కిషన్, సాయి,చేపూరి రాజు, చేపూరి సుమన్, ముని మాణిక్యం అజయ్, ఏం మహేష్, ఏం కృష్ణ, ఏం సవిన్, ఏం సంతోష్,ఏం వినోద్, చేపూరి భూమేష్, రజక సంఘం సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు