

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు
మేము జనసమీకరణ చేయలేదు జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తరలి వస్తున్నారు.జనం గుండెల్లో జగన్ ఉన్నారు.కాబట్టే జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు.జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారు.చంద్రబాబుకు ఏంభయం పుట్టుకుందో తెలియదు పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు
సూపర్ సిక్స్ అంటూ మాయమాటలు చెప్పారు.చంద్రబాబు పాలనలో అందరూ మోసపోయామని జగన్ కే ప్రజలు చెబుతున్నారు పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.ఏడాది కాలంగా వేధిస్తూనే ఉన్నారు.జగన్ సిఎం చేసేంత వరకూ వైసిపి నేతలెవరూ భయపడరు.రెడ్ బుక్ గురించి చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేశారు.రెడ్ బుక్ ప్రకారమే పాలన చేస్తున్నారు.మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు.జగన్ చుట్టూ ఉన్న వారందరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు