

జనం న్యూస్ 26 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా అంటరాని జాతికి ఆత్మగౌరవం నేర్పిన నేత.ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త వికలాంగుల పెన్షన్ల ప్రదాత వృద్దులు, వితంతువుల బతుకులకు దిక్కై తెలంగాణ అమరుల కుటుంబాల భరోసై తెల్ల రేషన్ కార్డుదారుల అన్నం మెతుకై. ఆడ బిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన గౌ”శ్రీ మంద కృష్ణ మాదిగ ముప్ఫై ఏళ్లుగా సామాజిక మానవీయ ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసి కోట్లాది మంది పీడిత, తాడిత పేద ప్రజల కోసం ఎన్నో అరుదైన పథకాలను సాధించి పదవులు లేకుండా ప్రజలకు సేవ చేసిన త్యాగమూర్తి మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు. ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని, నలభై ఏళ్ల ప్రజా జీవితాన్ని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేసిన శ్రీ మంద కృష్ణ మాదిగ ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి యావత్తు మాదిగ జాతి తరుపున కృతజ్ఞతలు.ఇది మాదిగలకు, అణగారిన సమాజాన్ని పులకరింపజేసిన ఘట్టం.