Listen to this article

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ :- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాన్ లి, పర్వతనేని నాగేశ్వరరావు( పెద్దబాబు) హాజరై జెండాలు ఎగరవేసి వందన సమర్పణ చేశారు, ప్రిన్సిపాల్ శివకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటామని ప్రతి సంవత్సరం జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం గా జరుపుతారని 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి తీసుకు వచ్చారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని విద్యార్థులకు తెలియజేశారు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ నకుల్ రావు మరియు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు, విద్యార్థులు భారత దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా వివిధ ప్రాంతాల వేషధారణలో అలరించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యం ,రజియా బేగం, ప్రియాంక, సంతోషి ,లక్ష్మీ కమల, బ్యూలా ,స్నేహలత, సంయోజిత, శ్వేత ,గిరిజ ,అనూష, ప్రేమ్ చంద్, రఘు టీచర్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.