

జనం న్యూస్ ,జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:= కౌటాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ జెండా ఎగురవేసే క్రమంలో జెండా పైకి వెళ్లిన తర్వాత తిరిగి కిందకు తాడును గుంజడంతో కింది వరకు వచ్చింది. రెండుసార్లు కిందకు పైనకు లాగారు. కిందకు వచ్ఛిన జెండాను మరోసారి పైకి లేపారు. మండల స్థాయి అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధుల ముందే జాతీయ జెండాకు అవమానం జరిగింది.