Listen to this article

జనం న్యూస్ జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- వాంకిడి మండలం లోని ఖమన గ్రామం తెలివాడ పాఠశాల 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు పాండురంగ ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జెండా ఎగరవేసి బడి పిల్లలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు పండు రంగా ఈ సందర్బంగా మాట్లాడుతూ, బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.. లౌకికత్వం,సమానత్వమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశమని, భారతదేశానికి రాజ్యాంగం కవచంలాంటిది అన్నారు.. స్వాతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింసా, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు.. అలాగే మరొకసారి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఖమన గ్రామ ప్రజలు విద్యార్థుల ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్ ఆయలు తదితరులు పాల్గొన్నారు