Listen to this article

జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

పదవతరగతి ఫలితాలు భవిష్యత్ ని నిర్ణయించే మొదటి అడుగు అని,బోర్డు పరీక్షలు అంటే భయపడకుండా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి లో జరుగుతున్న తెలుగు సబ్జెక్ట్ ని విద్యార్థులచే చదివిపించారు.అలాగే తెలుగు పదాలు చెప్పి విద్యార్థులతో రాపించారు.మాతృ భాష అయిన తెలుగు భాషపై విద్యార్థులు పట్టు సాధించాలని అలాగే బేసిక్ మ్యాథ్స్ కుడా చేసేలా విద్యార్థులను తయారు చేయాలని ఉపాధ్యాయులకి తెలిపారు.పదవ తరగతి లోనే ఇంటర్ ఎంపీసి చదవాల,బై పి సి చదవాలా,ఇంకా ఏమైనా చదవాలా అని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ఇప్పటినుండే చదవాలని తెలిపారు.విద్యార్థులు తెలుగు,ఇంగ్లీష్, మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలని బాగా ప్రాక్టిస్తే చేస్తే పర్ఫెక్ట్ గా సబ్జెక్టు పై అవగాహన ఏర్పడుతుందని అన్నారు.విద్యార్థులకి ప్రాక్టీస్ చేసేందుకు నోట్ బుక్స్, పెన్నులు ఇచ్చారు.పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటినారు.