

జనం న్యూస్ జులై(25) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట గ్రామంలోని ఆరవ వార్డులో మర్రిచెట్టు దగ్గర మురికి కాలువపై బండలు పగిలిపోవడంతో గత రెండు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన ఎలాంటి మరమ్మతులు చేయటంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు ప్రజలు, వాహనాలు తిరిగె చోటు కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వెంటనే కాలువపై బండలు వేసి బాగు చేయాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.