Listen to this article

జనం న్యూస్ జులై 25కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.

జై నూర్: ఆదివాసి హక్కులను, చట్టాలను పక్కడ్ బందీగా అమలు చేయాలని తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు మధురాజ్ మడావి శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల హక్కులను, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనులు అన్యాయానికి గురికాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండి మహిళల పోష్టికాహారం , చిన్నారులకు విద్యాభ్యాసం, గిరిజనుల రక్షణ, విద్యా ఉపాధి వైద్య రంగాలలో, గిరిజనులకు అన్ని విధాలుగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను పొగడ్బందీగా అమలు చేస్తూ జీవో నెంబర్ 49 ను శాశ్వతంగా రద్దు చేయాలని పేర్కొన్నారు ఈనెల 28న జరగబోయే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని ఆదివాసి మేధావులు సార్ మేడిలు గ్రామ పటేల్ గిరిజన యువత తదితర పార్టీలో ఉన్న నాయకులు ఆదివాసి సమాజం కోసం జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆత్రం అర్జున్, తుమ్రం దిలీప్ కుమార్, ప్రచార కార్యదర్శి గేడం నగేష్, కోశాధికారి మెశ్రం దత్తు, సోషల్ మీడియా కన్వీనర్ జుగునక ధర్మేందర్, కుమ్రా విగ్నేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు