Listen to this article

గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలి.

జనం న్యూస్,జూలై25,జూలూరుపాడు:

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు తప్పనిసరిగా పోటీ చెయ్యాలని విషయంపై మండలం పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి హాజరై వారు ప్రసంగిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారు అని తెలియజేస్తూ ప్రధాన మంత్రి మోడీ సారధ్యంలో భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే కాకుండా రాష్ట్రంలో అమలయ్యే సన్నబియ్యం , ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు , వీధి దీపాలు,పల్లె ప్రకృతి వనాలు,ఉచిత గ్యాస్ కలెక్షన్లు , ముద్ర లోన్లు తదితర పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేవి అని తెలుపుతూ స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయతీ నుండి బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందాలని అదేవిధంగా కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉండి పార్టీ బలోపేతానికి మరియు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాలకిషన్, మండల ప్రధాన కార్యదర్శులు భూక్యా శ్రీను,నిమ్మటూరి రామారావు,యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు,సోషల్ మీడియా కన్వీనర్ చరణ్, కార్యదర్శి బాబులాల్,కోశాధికారి వీరన్న మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.