

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ద్వారా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన సుకన్య సమృద్ధి యోజన వంటి వివిధ భీమా మరియు పథకాల గురించి అవగాహన మరియు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి అనేక మంది గ్రామ ప్రజల చేత స్థానిక బ్యాంకు సిబ్బంది మరియు గ్రామ యానిమేటర్లు సుధా,,సురేఖ మరియు శ్రీదేవి సహకారంతో స్థానిక బ్యాంకులో భీమా చేయించడం జరిగింది.గ్రామంలోని సూరబోయిన సుబ్బారావు మరియు ఎద్దు కోటేశ్వరమ్మ ప్రమాద వశాత్తు మరణించడంతో వారి నామీనీ లైన
సురబోయిన భూదేవి,గానుగుపాటి మేరీ లకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కుల ను స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ తాళ్లూరి రాజు చేతుల మీదుగా నామినీలకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజు మాట్లాడుతూ ప్రైవేటు సంస్థల కన్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థలో అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద భీమా మరియు సాధారణ భీమా అందిస్తున్నామని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే తమ బ్యాంకులో అనేక రకాల లోన్లు అందుబాటులో ఉన్నాయని బ్యాంకు కల్పించేటువంటి ఈ లోన్లు ఉపయోగించుకొని ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు రవిరాజు మరియు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రమాద బీమా మరియు సాధారణ బీమా లతో పాటు అటల్ పెన్షన్ యోజనలను మరియు సుకన్య సమృద్ధి యోజన పథకాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈమధ్య జరుగుతున్నటువంటి సైబర్ మోసాలు గురించి ప్రతిరోజు అవగాహన మరియు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిలో పాల్గొనే ప్రజలు అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రాము, వలి యానిమేటర్ శ్రీదేవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు