

జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో 1999 సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ పోరులో అమరులైన వీర జవాన్లను త్యాగదనులను స్మరించుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు సిబ్బందితోపాటు నెహ్రూ యువజన కేంద్రం ప్రతినిధి ప్రేమ్ భరత్ కుమార్, NCC 13 వ బెటాలియన్ కమాండర్ కల్యాణ అశోక్ గారు విజయనగరం మాజీ సైనిక సంక్షేమ సంఘము మరియు నేతాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమములో విజయవంతం చేశారు.. ఇటువంటి ప్రత్యేకమైన రోజునే కాకుండా వీర సైనికుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ ఉండాలని వ్యక్తులు పిలుపునిచ్చారు…