Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం జులై 26

సమాజసేవలో ముందుండే ప్రధానోపాధ్యాయుడు ,మార్కాపురం లైన్స్ క్లబ్ డైరెక్టర్ జగన్ ఈరోజు తాను పనిచేస్తున్న జగన్నాధపురం ఎంపీపీ ఎస్ లో విద్యార్థుల అభ్యున్నతి కోసం తన సొంత నిధులు 4500 రూపాయలు వెచ్చించి ప్రతి విద్యార్థికి టై, ఎగ్జామ్ పాడ్ ,కాపీ రైటింగ్ బుక్స్,నోట్ బుక్స్ ,పెన్సిల్స్, స్లేట్స్ అందించడం జరిగింది. విద్యలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారందరికీ తెలుగు, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ బుక్స్ దానితోపాటు ఎక్సామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన షూస్, యూనిఫామ్, బెల్ట్ తో పాటు అందరికీ తన సొంత డబ్బు తో టై లు అందించడం జరిగింది. జగన్ ఏ స్కూల్లో పనిచేస్తున్న ఆ స్కూలు అభివృద్ధికి తన సొంత నిధులతో పూర్తిగా అభివృద్ధి చేయడం అలవాటుగా చేసుకున్నారు . పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ గ్రామస్తుల మన్ననలను పొందుతున్న జగన్ ని పలువురు అభినందించారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎం అనూష పాల్గొన్నారు. అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కశ్శెట్టి జగన్ ని పాఠశాల కమిటీ చైర్మన్ తంగిరాల అనిల్ కుమార్ మాట్లాడుతూ జగన్ సార్ స్కూల్స్ అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజలకు అన్నదానం చేసే వెలుగొండ సత్రానికి అధ్యక్షుడు గా, అలాగే ఈ మధ్య తుమ్మలచెరువు దారిలో ఉండే చిల్లకంపను జెసిబి తో తొలగించడం, అలాగే తర్లుపాడు హిందూ శ్మశానవాటికని దాతల సహకారం తో అభివృద్ధి చేయడం.ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న జగన్ సార్ ని అభినందించారు. అలాగే జగన్నాధపురం గ్రామం ప్రజలు జగన్ సార్ లాంటి సామాజిక స్పృహ కల్గిన టీచర్ మా వూరి స్కూల్ కి రావడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు.