Listen to this article

జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి వాతావరణంలో గ్రామసభ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామము పచ్చని చెట్లు పచ్చని పొలాలు చాలా ఆనందంగా ఉంది అంటూ రైతు భరోసా, కింద 288 మందికి గాను దీంట్లో623 ఎకరాల 4 గుంటలు దీనికి ఒక సీజన్ కు ప్రభుత్వము ఎంత చెల్లిస్తుందంటే 37 లక్షల 34 వేల ,620 రూపాలు రైతు భరోసా కింద చెల్లిస్తుంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కింద ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. అలాగే రేషన్‌ కార్డుల జారీ, 50 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతూ 34 ఇండ్లు సాంక్షన్ అయిన అని చెప్పారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామసభలో చెప్పారు. 4 పథకాల్లో రేషన్‌ కార్డులకు సంబంధించి తహసీల్దార్‌ నేతృత్వంలో, ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీడీవో ఆధ్వర్యంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయాధికారి, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకం ఏపీఓ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్, తాసిల్దార్ సత్యనారాయణలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుతారి రమేష్, డి సి ఎం ఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భూమా గౌడ్, ఎం పీ ఓ అబ్బ గౌడ్, ఎం ఏ ఓ నరేంద్ర, ఏ ఈ ఓ రాఘవేంద్ర, లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు