Listen to this article

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి. కొప్పుల రమేష్ మాదిగ

కొత్తగూడెం ఆర్ సి జూలై 26 ( జనం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నూతన గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నుకోబడిన పసుపులేటి వీరబాబుని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల, ఆధ్వర్యంలో సభ అధ్యక్షులుగా కురిమెళ్ళ శంకర్, భూపతి శ్రీనివాసరావు, కొప్పుల రమేష్, ఆధ్వర్యంలో ఘనమైన సన్మానం జరిగినది, కొప్పుల రమేష్ మాదిగ,మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల పాటు నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన బీసీ బిడ్డ అయిన పసుపులేటి వీరబాబుని పార్టీ గుర్తించి గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వడం భద్రాద్రి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ, సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి పసుపులేటి వీరబాబు ని మల్లెల రామనాథం, మల్లెల ఉషారాణి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం ఉపేందర్ నాయుడు , పితాని సత్యనారాయణ, మునిల,తాండ్ర వెంకటేశ్వర్లు,కోదాడ శ్రీనివాస్, రాజేశ్వరి, కొప్పుల రమేష్,కత్తి బాలకృష్ణ,జక్కుల పాల్గుణ, తదితర బహుజన బీసీ నాయకులు శాలువలు పూలమాల బోకెలతో పసుపులేటి వీరబాబుని ఘనంగా సన్మానించారు, అనంతరం పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీమతి రేణుక చౌదరి కు ఎప్పటికీ రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన ఈ గ్రంథాలే చైర్మన్ పదవిని తూచా తప్పకుండా నిరుద్యోగులందరికీ ఉపయోగపడేలా సేవలు చేస్తానని ముఖ్యంగా బీసీలు చేస్తున్న పోరాటాల మూలంగా బీసీ బిడ్డనైన నాకు ఈ అవకాశం కలిగిందని ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనిది మీ బీసీ పోరాటాల వల్లే పదవులు వస్తున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరబాబు అభిమానులు వందలాది మంది పాల్గొని విజయవంతం చేశారు,