

జనం న్యూస్ జూలై 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల పరిధిలోని కోదండరామాపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాన్లు దగ్ధం. బాధితుడు దార్ల లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల, శనివారం ఉదయం 8:30 గంటలకు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది.టీవీ, ఫ్యాన్,పదివేల రూపాయల నగదుతో పాటు గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.నిరుపేద కుటుంబమైనా లాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
