

జనం న్యూస్ జులై 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
చదువుతో దేనినైనా సాధించవచ్చు అని తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సీఈవో అంటోనీ రెడ్డి, అన్నారు. ఈమధ్య జరుగుతున్న మానవ అక్రమ రవాణా పై ప్రజ్వల స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ డే అగ్నిస్ట్ ట్రాఫికింగ్ పర్సన్ పేరిట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీలో విద్యార్థులకు, మండల ప్రజలకు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతూ ఉన్నత శిఖరాలను అవరోదించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదువుకుంటే సాధించలేనిది ఏది ఉండదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహ భావంతో మెలిగి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని కోరారు. ఆడపిల్లల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. యుతి యువకులు ప్రేమలంటూ కాలయాపన చేసి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తమ గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రేమ పేరిట యువతలకు మాయ మాటలు చెప్పి పోరుగు రాష్ట్రాలలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా ను హరికట్టే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అంతకుముందు పోలీస్ కళాజాత బృందం చేసిన బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నాటికలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు సిబ్బందికి పోలీసుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ బాధితులు రవీందర్, సరిత, లలింగన్న,ఎంపీడీవో మల్లేష్, సిడిపిఓ తిరుపతమ్మ, డాక్టర్ పల్లవి, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్, మాజీ సర్పంచ్ బాదిరావు జిల్లా సర్మెడి కుర్సెంగ మోతిరామ్ సీసీ సంతోష్ సేర్పు సిబ్బంది, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సభ్యులు వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.