Listen to this article

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి

జనం న్యూస్ నడిగూడెం, జూలై 26,

దేశంలో 11 సంవత్సరాల కాలంగా బిజెపి మతోన్మాద శక్తులు దేశంలో మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి విమర్శించారు.శనివారం మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై క్లాసు లు ప్రారంభించి మాట్లాడుతూ.. లౌకిక రాజ్యాంగాన్ని మార్చి సనాతన ధర్మం పేరుతో మనువాద రాజ్యాంగాన్ని అమలుకు బీజేపీ పూనుకుంటుందని ఆమె విమర్శించారు.కేంద్రంలో మోడీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి అనేక మంది లౌకిక మేధావులను అభ్యుదయ వాదులను హత్య చేస్తూ, ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.దేశ పరిరక్షణ కోసం వామపక్ష లౌకిక శక్తులన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన ఎన్నికల వాగ్దానాలో ప్రకటించిన పథకాలు నేటికీ అమలుకు నోచుకోవటం లేదనిఅన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే రెండు మాసాలలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సందర్బంగా సిరిపురం, గోపాలపురం గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నుండి 30 కుటుంబాల నుండి పార్టీ లో చేరారు.ఈ శిక్షణా తరగతుల్లో ప్రిన్సిపాల్ గా మండల కార్యదర్శి సత్యనారాయణ వ్యవహరించిగా సిపిఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాములు వివిధ అంశాలపై క్లాసులు భోదించారు. ఈ శిక్షణా తరగతులకు మండల కమిటీ సభ్యులు
వీరాంజనేయులు, హనుమయ్య, కిషోర్,వెంకన్న,సధాకర్ రెడ్డి, సైదులు,నాగమణి,స్వాతి,సైదా హుస్సేన్,హనీఫ్,సంపత్, పిచ్చయ్య,మస్తాన్,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.