

జనం న్యూస్:- రాజ్యాంగం అమలైన రోజునే నడి రోడ్డుపై దారుణం జరిగింది. టిఫిన్ బండి నిర్వహకురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు ఆమె జుట్టుపట్టుకుని కిలో మీటర్ మేర కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన విశాఖ సిటీ నడిబోడ్డులో జరిగింది. మిధులపురి ఉడా కాలనీలో మహిళ టిఫిన్ బండి నిర్వహిస్తున్నారు. ఏమైందో గానీ నడిరోడ్డు మీద ఆమెపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు అందరూ చూస్తుండగా ఆమెను విచారణారహితంగా కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. స్థానికులు విడిపించేందుకు ప్రయత్నం చేసినా ఓ మహిళ విడిచిపెట్టలేదు. చాతీపై కాలుతో తన్నుతూ విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలో బాధితులకు పీఎమ్ పాలెం పోలీస్ స్టేషన్‌లో బిగ్ షాక్ తగిలింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు తనను బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే తనపైనా ఎఫైర్ నమోదు చేస్తానని సీఐ బెదిరించారనిబాధితులు వాపోయారు. మరోవైపు బాధితురాలిని రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాధితురాలకి నెటిజన్లు మద్దతు తెలిపారు. ఆమెను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.