Listen to this article

జనం న్యూస్:28 జులై సోమవారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రథమ భాష తెలుగులో ఒకటో తరగతి గాను అచ్చుల పాట సిద్దిపేట జిల్లాకు చెందిన ఎడ్ల లక్ష్మీ రాసిన గేయం ప్రచురితం కావడం పట్ల సిద్దిపేట కవులు హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక మహాత్మా గాంధీ పార్క్ సిద్దిపేటలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో బాలసాహిత్యంలో సిద్దిపేట ఖ్యాతిని లక్ష్మి నిలిపినందుకు అభినందించారు. కార్యక్రమంలో కవులు ఐత చంద్రయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య , బస్వ రాజ్ కుమార్ , కాల్వ రాజయ్య, పిడపర్తి అనిత గిరి, మల్లంల కనకయ్య, ఎడ్ల భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.