Listen to this article

జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ముమ్మిడివరం రీజియన్ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం కాట్రేనికొనలోని బుంగ డేవిడ్ జ్యోతి చర్చిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బిషప్ డేనియల్ పాల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనంలో జిల్లా గౌరవ అధ్యక్షులు సామ్యూల్ పిన్ని మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపనకు మానవ మనుగడకు కృషి చేయాల్సిన బాధ్యత పాస్టర్లపై ఎంతైనా ఉందన్నారు. క్రైస్తవ సంఘాల బలోపేతం పాస్టర్ల ఐక్యత వారి సమస్యలు తదితర వాటిపై చర్చించారు . ఈ సమ్మేళనంలో జిల్లా రీజనల్ క్రైస్తవ నాయకులు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.