

జనం న్యూస్ జులై 30,
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకొనగా తప్పించుకొని పారిపోయారు. సోమవారం రాత్రి పట్టణంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో బీజాపూర్ హైవే పై పోలీసులు వాహనాలు తనిఖీలు చేసుండగా కర్ణాటక కు చెందిన కేఏ 38 ఇబి 0776 బైకుపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడాన్ని చూసిన పోలీసులు వాహనాన్ని ఆపి వారి దగ్గర ఉన్నటువంటి సంచి మూటను గమనించి సంచిని తెరిచి చూడగా సంచిలో నాటు తుపాకి,కత్తి, స్కూల్ డ్రైవర్లు, లభించగా ఇవి మీ దగ్గర ఎందుకు ఉన్నాయని అడగగా వారు పోలీసుల నుండి తప్పించుకొని పంట పొలాలలో నుండి దొంగలు పరారయ్యారు. వీరు అంతరాష్ట్ర దొంగల ముఠా అని అనుమానం, వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ ,ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకొని వెంటనే దుండగులను పరారైన పొలాల చుట్టూ చూసి దొంగల ముఠా కోసం చర్యలు చేపట్టుతున్నామని ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు.