

జనం న్యూస్ జూలై 30 అమలాపురం
అమలాపురం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశము అమలాపురం మెయిన్ రోడ్డు నందు గల శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు బుధవారం మధ్యాహ్నం జరిగింది ఈ సందర్భంగా సంఘ సేవా కార్యక్రమాలతో పాటు సంఘ అభివృద్ధి కార్యక్రమాలను చర్చించారు అనంతరం స్నేక్ స్కేచర్ జంపన గణేష్ వర్మ చేస్తున్న సేవలకు గాను ఆయనను సంఘ ఆధ్వర్యంలో సత్కరించారు.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మనుషులు పాములను చూస్తే ఏ విధంగా భయపడతారో అదే విధంగా పాములు కూడా మనుషులు చూస్తే భయపడతాయని అవి నివసించే ప్రాంతాన్ని మరిచిపోయినప్పుడు మాత్రమే బయటకు వస్తాయని పాము పెట్టిన పుట్టలో గుడ్లు, పాలు, చలిమిడి, వంటివివేసి వాటికి ఇబ్బంది కలిగిస్తు ఉంటారని వాటిని ఎప్పుడూ కూడా పుట్ట బయట మాత్రమే వేయాలని పాము పుట్ట అడుగు భాగమున కొన్ని అడుగుల లోతులను పాము నివసిస్తూ ఉంటుందని పాము గుడ్లు నాలుగు ఐదు చోట్ల పెడుతుందని వాటిలో కొన్ని ప్రాంతాల్లోని గుడ్లను తానే తినేస్తుందని మిగిలిన గుడ్లు పాములుగా మారతాయని ఆయన అన్నారు.
పాము కరిసిన వెంటనే భయంతో కొంతమంది మరణిస్తున్నారని భయపడకుండా ఉండి వైద్య చికిత్స పొందాలని పాము కనపడినప్పుడు మంత్రపు గింజలను ఆ పాము ఉన్న ప్రాంతమంతా జల్లేయడం వలన అవి బయటకు వెళ్లే మార్గం లేకుండా పోతుందని అలా కాకుండా కొంత మార్గాన్ని వదిలి జల్లాలని అప్పుడు అది బయటకు వెళ్ళటానికి మార్గంగా ఉంటుందని సూచించారు పాములకు రెప్పలు ఉండవని నిద్రపోతూ కూడా చూడగలదని ఆయన తెలిపారు ఇటీవల కాలంలో క్వారీ లారీలలో అతి ప్రమాదకరమైన రక్తపింజర పాములు మన ప్రాంతానికి వస్తున్నాయని అవి అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు ఈ సేవా కార్యక్రమాల్లోనికి తాను మామ్మను ఆదర్శంగా తీసుకుని ఊరిలోని వారు, స్నేహితులు అందరూ చెప్పడాన్ని బట్టి వచ్చానని ఎవరైనా తన అవసరం ఉన్నచో 9949956232కు ఏ టైం లో నైనా సంప్రదించ వచ్చునని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శశిధర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వివిధ రుణాలను వడ్డీరేట్లను వివరించారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు నంబూరి విశ్వనాథం, అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు( విస్సు) కార్యదర్శి నూలు సూర్య ప్రభాకర్ రావు (సూరిబాబు) కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు రాంపండు కోఆర్డినేటర్ నంబూరి శ్రీనివాస్ లతోపాటు అధిక సంఖ్యలో సర్వ సభ్యులు పాల్గొన్నారు.