Listen to this article

జనం న్యూస్ జులై 30 కోటబొమ్మాళి మండలం :

రాష్ట్ర టిడిపి కార్యదర్శి, కళింగ కోమటి సంఘం రాష్ట్ర అద్యక్షుడు బోయిన గోవిందరాజులు చేసిన అక్రమణలు కప్పికొనేందుకే వైకాపా పై ఆరోపణలు చేశారని కోటబొమ్మాళికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కాళ్ళ సంజీవరావు, కమ్మకట్టు శ్రీనివాస్‌రెడ్డి, కల్లి విశ్వనాధరెడ్డిలు అన్నారు. వారు బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు జనార్థన్‌ స్వగృహంలో విలేకర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 ఎకరాలకు సాగు నీరు అందించే సుమారు 30 ఎకరాలు ఉండే పెద్దచెరువును గోవిందరాజులు అక్రమించు కోగా ప్రస్తుతం 10 ఎకరాలకు చేశారని, అలాగే కోటబొమ్మాళి కొండ పక్కన జర్జంగి గ్రామానికి చెందిన దొరమ్మ దగ్గర అప్పట్లో 25 ఎకరాలు కొనుగోలు చేసి పక్కన ఉన్న కొండ ఫోరంబోకు స్ధలం 15 ఎకరాలను కబ్జా చేశారని, వీటిపై పలువురు నాయకులు జిల్లా కలెక్టర్‌కు, టెక్కలి ఆర్‌డీవోకు పిర్యాదు చేయటంతో వారు వచ్చి ఎక్కడ విచారణ చేపడతారనే భయంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు తనకు అండగా ఉండాలంటే వైకాపా నాయకులకు విమర్శంచాలనుకొని మంత్రుల మెప్పుకోసం ఉత్తరాంధ్రను వైకాపా నాయకులు దోచుకున్నారని గోవిందరాజులు ఆరోపిస్తున్నారని వారు తెలిపారు. కోటబొమ్మాళిని గడిచిన 40 ఏళ్ళుగా దోచుకున్నది బోయిన గోవిందరాజులేనని, ఈ విషయం మండల కేంద్రంలో ఎవరిని అడిగిన చెబుతారని, అందుకు నిదర్శనం పెద్దచెరువేనని వారు దుయ్యబట్టారు. గోవిందరాజులు కోట్ల రూపాయిలు బ్యాంకుల ద్వారా లోను రూపంలో తీసుకుని అవి తీర్చకుండా ఐబి పెట్టారని వీరు విమర్శంచారు. వైకాపా నాయకులకు విమర్శించు ముందు తమరు ఎంత నిజాయతీ పరులో తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యాక్షుడు అన్నెపు రామారావు, మండల పార్టీ అద్యక్షుడు సంపతిరావు హేమసుందరరాజు, ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు, మండల విప్‌ బొడ్డు అప్పన్న, డబ్బీరు ప్రదీప్‌, నాగరాజు, సింగుపురం వినోద్‌, శివారెడ్డి, నేతింటి అప్పలస్వామి, తదితర నాయకులు ఉన్నారు.