Listen to this article

జనం న్యూస్ జూలై 30:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలం :రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జి పి ఏఫ్ పార్ట్ ఫైనల్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినందుకు గానుతెలంగాణ పి ఆర్ టీ యు ఏర్గట్ల మండల శాఖ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.దీని ప్రకారం, ఉద్యోగులకు ఉన్న వివిధ రకాల పెండింగ్ బిల్లులలో ముఖ్యంగా 2023,2024,2025ఆర్థిక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పార్ట్ ఫైనల్స్ విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టీ యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్ రెడ్డి మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటెస్టెంటెడ్ క్యాండిడేట్ వంగా మహేందర్ రెడ్డి పలుసార్లు కలిసి చర్చించి ముందే తెలియజేసిన విధంగా ఈరోజు విడుదల అవ్వడం జరిగిందిఈ సందర్భంగా టీచర్ ఏమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టీ యు రాష్ట్ర శాఖ మిగతా మిగిలి ఉన్న పెండింగ్ బకాయిలను త్వరితగతిన ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని తెలిపారని టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అలాగే రాష్ట్ర శాఖకు కిందిస్థాయిలో ఉన్న ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను అనునిత్యం నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్న మోహన్ రెడ్డి కిషన్ తెలంగాణ పి ఆర్ టీ యు “ఉపాధ్యాయుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. వారు దేశ భవిష్యత్తు నిర్మాణకర్తలు. వారి సేవలకు తగ్గ గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి చలనం కూడా చక్కదిద్దేందుకు కృషి చేస్తోందనీ పిఆర్టియు టీఎస్ ఏర్గట్ల మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ తెలియజేశారు