

జనం న్యూస్ జూలై 31 ముమ్మిడివరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కొన మండలం లోని లక్ష్మీవాడ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విత్తనాల రాజేశ్వరరావు భార్య అర్జమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం కుటుంబ సభ్యులను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పితాని బాలకృష్ణ పరామర్శించారు. అర్జమ్మ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పితాని వెంట కాట్రేనికోన మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, లక్ష్మీ వాడ సర్పంచ్ చొల్లంగి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
