

భద్రాద్రి కొత్తగూడెం01 ఆగస్టు ( జనం న్యూస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాబు క్యాంపు వంట శీను అని ఒక దివ్యంగుడికి వంట వండడం లో మంచి పేరు ఉంది మంచి వంట మాస్టర్ గా అనేక పెద్ద పెద్ద పెళ్లిళ్లు అనేక ఫంక్షన్లు భద్రాద్రి కొత్తగూడెంలో చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఒక ఐదు సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు పూర్తిగా పోయినప్పటికీ దివ్యాంగుడిగా కుంగిపోకుండా తన వంట మాస్టర్ కలని పదిమందికి జీవనోపాధి ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అలాంటి బాబు క్యాంప్ శీనన్న అలియాస్ వంట శీను కు గతంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కర్రీ పాయింట్ ఉండేది అక్కడ పెద్ద డబ్బా కూడా ఉండేది అప్పుడు గత ఎమ్మెల్యే చేకూరి కాశయ్య విగ్రహం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వైండింగ్ చేస్తామని చెప్పి అక్కడ డబ్బాలన్నీ తీసివేశారు కానీ రోడ్డు వైండింగ్ జరగకపోగా అక్కడ రోడ్డుకు అడ్డంగా ఎటువంటి అనుమతులు లేకుండా నేషనల్ హైవే అనుమతులు లేకుండా ఆర్ అండ్ బి అనుమతులు లేకుండా మాజీ ఎమ్మెల్యే విగ్రహం చేకూరి కాశయ్యది ఏర్పాటు చేసినారు అయినప్పటికీ దివ్యాంగుడు మనోధైర్యం కోల్పోకుండా పక్కన కాలి స్థలం ఉంటే నిరుపేద దివ్యాంగుడు మంచి వంట మాస్టర్ అయిన శీనన్న తన పాత కాలి స్థలము పక్కన చిన్నగా స్థలం ఉంటే సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని జీవనోపాధి కోసం ఒక ఐరన్ రేకులతో డబ్బా పెట్టుకుంటే నిర్దాక్షణ్యంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కొత్తగూడెం కార్పొరేషన్ అధికారులు ఎవరి ప్రోద్బలంతో దివ్యాంగుడైన వంట శీను పై తమ ప్రతాపం చూపించడానికి ఏకంగా కొత్తగూడెం కార్పొరేషన్ వారు సుమారు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వచ్చి ప్రోక్లైన్రుతో లక్ష రూపాయలు విలువ చేసే డబ్బాను పూర్తిగా సర్వనాశనం చేశారు ఇది దివ్యాంగుల సమాజం ఎప్పటికీ క్షమించదని ఇప్పటికైనా కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సొంత ఖర్చులతో లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ దివ్యాంగుడికి డబ్బా చేసి అక్కడ జీవనోపాధి కోసం కర్రీ పాయింట్ ఏర్పాటు చేసేలా మున్సిపాలిటీ వాళ్లే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బట్టి విక్రమార్క దివ్యాంగులకు మహిళలకు రోడ్డు పాయింట్లలో జీవనోపాధి కోసం కంటైనర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ముందు చూపుతో లోన్లు మంజూరు చేసి జీవనోపాధి చూపిస్తుంటే ఒక నిరుపేద దివ్యాంగుడు సొంత ఖర్చులతో చిన్న డబ్బా ఏర్పాటు చేసుకొని కర్రీ పాయింట్ ఏర్పాటు చేసుకుంటే కావాలని కక్షగట్టి కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు ముందస్తు సమాచారం లేకుండా డబ్బాను తుక్కుతుక్కు చేయడం చాలా అన్యాయమని అమానుశ్రమని ఈ చర్యను తీవ్రంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం మరియు తెలంగాణ దివ్యాంగుల సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ మరియు కొత్తగూడెం కార్పొరేషన్ అధికారుల చర్యలను తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం మరియు ఆర్.పి.ఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే అధికారులు చేసిన తప్పుడు చర్యలను సరిదిద్దుకొని వెంటనే దివ్యాంగుడైన వంట శీను అలియాస్ బాబు క్యాంప్ శీనుకు కొత్తగా డబ్బా ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం మరియు ఆర్.పి.ఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అధ్యక్షుడు కోటా శివశంకర్ డిమాండ్ చేసారు