

జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలో అతి చారిత్రాత్మక కట్టడమైన సింహాచలం మేడను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
సింహాచలం మేడ తొలగింపుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సింహాచలం మేడను చారిత్రక సంపదగా జిల్లా ప్రజలు నేటికీ చర్చించుకుంటుంటారు. ప్రస్తుతం మేడను తొలగించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో శుక్రవారం సింహాచలం మేడ వద్ద నిరసనకు పట్టణ పౌర సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది.