Listen to this article

మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..

మహిళా వేధింపులపై డయల్ 100, షిటీమ్ పోలీస్ 8712686056 కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి..

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ..

జనం న్యూస్ ఆగష్టు 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

పని ప్రదేశంలో, ఉద్యోగం చేసే చోట మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.పని చేసే చోట మహిళలకు భద్రత, భరోసా కల్పించడం అందరి బాధ్యత, మహిళలను గౌరవించడం మన సంప్రదాయం,వారి ఎదుగుదలకు తోడ్పాటు ఇవ్వాలి, మహిళా సాధికారిత సమాజానికి మంచిది అని శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు, కాలం, సమయం లెక్కచేయక పని చేస్తున్నారన్నారు.కుటుంబాన్ని పిల్లలను సరిదిద్దడంలో తల్లిగా మహిళా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నది, అలాంటి మహిళా సమాజంలో ఏదోరకంగా వేధింపులకు గురవుతూనే ఉన్నది అన్నారు. పోలీసు శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది అన్నారు.ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు,బ్యాంక్ లు, మార్కెట్ లు,ప్రభుత్వ ప్రవేటు సంస్థలు, ఫ్యాక్టరీలు, కూలీ ప్రదేశాలు ఇలా ఎక్కడైనా మహిళా పని చేసేచోట మహిళలను వేధించిన, ఇబ్బందులకు గురి చేసిన, అపహస్యం చేసినా, కించపరిచినా చట్టపరంగా చర్యలు ఉంటాయి అన్నారు. వేధింపులకు సంప్రదించి డయల్ 100 కు,జిల్లా షిటీమ్ పోలీస్ 8712686056 నంబర్ కు ఫిర్యాదు చేయాలి అన్నారు.