

జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం
నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని డిపిఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్సుర్ నాయక్, ఏపీఓ రవీందర్ నాయక్, ఎంపీఓ విజయ్ కుమారి, ఈసి శ్రీనివాస్, టిఏ సురేష్, పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.