Listen to this article

జనం న్యూస్.ఆగస్టు1. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

గుర్తు తెలియనివాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తికి గాయాలైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది..ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలం కాసాల – దౌల్తాబాద్ గ్రామ శివారులో సుమారు 65 సంవత్సరాల గల ఓగుర్తుతెలియని వృద్ధుడు కొంతకాలంగా బిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు.బుధవారం రాత్రి కాసాల శివారులో గల ఇండియన్ పెట్రోల్ పంప్ వద్ద గుర్తుతెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టడంతో అతని రెండు కాళ్ళకు బలమైన గాయాలయ్యాయి.అటువైపు వెళుతున్న కొందరు వ్యక్తులు గాయాలైన వ్యక్తిని చూసి 100 కాల్ సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని ఎస్ఐ తెలిపారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని వైద్య చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.ఆ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారంనాడు మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. గుర్తుతెలియని అట్టి వ్యక్తి గీతల టీ షర్టు.లుంగీ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆవ్యక్తిని గుర్తించినట్లయితే హత్నూర పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు. కాసాల గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు .