

హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
జనం న్యూస్,ఆగస్టు 02,అచ్యుతాపురం:
ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది ఫలితాలు విడుదల చేసింది. ఈ మేరకు అచ్యుతాపురం మండలం మత్స్యకార గ్రామమైన పూడిమడక నుంచి మేరుగు అచ్యుతరావు,చోడిపల్లి కృష్ణ ప్రసాద్,చోడిపల్లి యశ్వంత్,ఎరిపల్లి వసంతరావు అనే నలుగురు గంగపుత్రులు కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపికయ్యారు.నలుగురు మత్స్యకార యువకులు కానిస్టేబుళ్లగా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.