జనం న్యూస్;2 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేట భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లు కట్టుకుని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహం విలువ గురించి ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయులు రత్నమాల, దేవిక, రేఖ, అషు, సమత, శ్రీలత, మనూష, అరుణ తదితరులు పాల్గొన్నారు.


