

జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
వత్తాసు పలుకుతున్న రెవిన్యూ సిబ్బందిపై ద్రుష్టి పెట్టండి*
తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు
మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తాం: తహసీల్దార్ స్వామి
జర్నలిస్టుల విలువలు దిగజార్చే విధంగా వ్యవహారిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధి బృందం మండల తహసీల్దార్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం కేపీహెచ్బీ కాలనీలోని మండల తహసిల్దార్ స్వామి నాయక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ బోర్లు వేసే దగ్గర కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. జర్నలిస్టుల పేరుతో సామాన్యులను బెదిరించడమే కాకుండా ఉన్నతాధికారులకు కూడా ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇది సరైన చర్యలు కావనివారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్న వారికి కొందరు రెవెన్యూ సిబ్బంది కూడా వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. సామాన్యులను ఇబ్బందుల గురిచేయడంలో జర్నలిస్టుల ముసుగులో ఉన్నవారికి వత్తాసు పలుకుతున్న రెవిన్యూ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నానాటికి దిగజారిపోతున్న జర్నలిస్టుల విలువలను కాపాడటంలో మండల మేజిస్ట్రేట్ గా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అడ్డదిడ్డంగా ఫోన్లు చేస్తూ ఇబ్బందుల గురి చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన తహసిల్దార్ స్వామి నాయక్ జర్నలిస్టుల సంఘాలు తీసుకుని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొందరు చేస్తున్న తప్పుడు పనుల తో నిజమైన జర్నలిస్టులకు విలువ లేకుండా పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. జర్నలిస్టులు అందరు కలిసి తీసుకున్న నిర్ణయం మంచి పరిణామాలకు దారి తీస్తుందన్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నటువంటి తమ సిబ్బంది పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, సంఘం రాష్ట్ర నాయకులు దయసాగర్, నిమ్మల శ్రీనివాస్, లక్ష్మణ్ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం ఏ కరీం, జర్నలిస్టుల సంఘం నాయకులు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గంగరాజు, చంద్ర, సదా మహేష్, మాణిక్య రెడ్డి, నాగరాజు, హరిబాబు, సాగర్ రెడ్డి, హరి, పవన్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.