*పెద్దవాగు ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం.
జనం న్యూస్ ఆగస్టు 3 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలల్లో మరొక హామీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ప్రోగ్రాని శనివారం మేడేపల్లి సచివాలయం ఆర్ బి కే కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులు కూటమి నాయకులు పాల్గొని ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన పోరాడి ఆనాడు రైతుల కష్టాలను ముఖ్యమంత్రి స్వయంగా చూసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీ మేరకు రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటి విడతగా అర్హులైనటువంటి రైతులకు 7 వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మండలంలో మొత్తం 402 మంది రైతులకు లబ్ధి చేకూరిందని రైతుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని టిడిపి మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నారు.అదేవిధంగా గతేడాది పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో భారీగా వరద వచ్చి కొందరి రైతుల పొలాలలో ఇసుక మ్యాటలు వేయడంతో ఆ రైతుల పూర్తిగా నష్టపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 316 మంది రైతుల కూడా లబ్ధి చేకూరింది అని వారన్నారు. ఈ కార్యక్రమంలోబిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఓలేటి అనిల్, నాయకులు శాఖమూరి సంజీవులు, నూపా శ్రీరాములు, కరటూరి రాధాకృష్ణ, చాపర్ల శ్రీను, కోటిపల్లి ముత్యాలరావు, కుంజా విజయ్, శరీయం రాజులు, కట్టే లక్ష్మయ్య, పదం రమేష్, మరియు రైతులు పాల్గొన్నారు.


