

జనం న్యూస్ ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి
డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ పదాదికారులు, కార్యవర్గ సభ్యులు సమావేశం కాటన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పదాధికారులకు, కార్యవర్గ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రతీ బూత్ సభ్యుడు వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులు అందుబాటు లో ఉండాలి. ప్రతీ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూటమి ధర్మం పాటిస్తూ బీజేపీ సత్తా చాటేలా కార్యకర్తలు కృషి చేయాలి. ప్రతి గ్రామంలో బూత్ కమిటీ లు అన్నీ పూర్తి చేయాలి అని తెలియజేశారు. ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానే పల్లి అయ్యాజీ వేమా, జిల్లా ఇన్చార్జి పొట్లూరి రామ్మోహన్ రావు, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, పూర్వపు జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ కర్రి చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురుమిల్లి శ్రీనివాసరావు, కొప్పాడి దత్తాత్రేయ, సలాది వీరబాబు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పార్టీ పదాది కారులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
