

జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జులై 31 వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు వరంగల్ లోని మామునూర్ పీటీసీ లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 లో స్టేట్ లెవల్ లో ఫోరెన్సిక్ మెడికో లీగల్ విభాగంలో శాయంపేట సీఐ పి రంజిత్ రావు రజత పథకం టీం విభాగంలో హార్డ్ లైనర్ ట్రోఫిని గెలుచుకున్నారు ఈ సందర్భంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ జైలు డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ డీజీపీ అంకిత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు అనంతరం సీఐ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం నాకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి జాతీయ స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొంటున్నారు ఈ అవార్డు రావడానికి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది సీఐ కి శుభాకాంక్షలు తెలిపారు…..