Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట: రాజంపేట బై పాస్ లో ఉన్న మేడా భవన్ లో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వి.పి రామచంద్రారెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి, NRI లు రాజాసాబ్, గోపాల్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడ రఘునాధ్ రెడ్డి గల్ఫ్ లో ముఖ్యంగా కువైట్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పేరుతో మీరు చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని తెలుపుతూ గల్ఫ్ లో ఉన్న మన వారు ఇక్కడైనా అక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కువైట్,దుబాయి నుండి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి విమానాలు ల్యాన్డ్ అయ్యేందుకు కృషి చేస్తున్నాని తెలిపారు, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, గల్ఫ్ అడ్వైజర్ మహేశ్వర్ రెడ్డి, కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన వై.యస్.ఆర్. అన్నమయ్య జిల్లా నుండి సుమారు సుమారు 3 లక్షల మంది ఉన్నారని కువైట్, దుబాయి నుండి రేణిగుంట విమానాశ్రయానికి విమానాలు దిగేందుకు మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. డిశంబర్ నెలలో కువైట్ యంపీ ని కువైట్ కు ఆహ్వానించారు.