Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా వెంట్రు సుధీర్ నియమితులైన సందర్బంగా ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారం కండ్రిగ చెరువు గ్రామంలో రేమా బ్లెస్సింగ్ చర్చ్ దైవజనులు ఆబ్బెజ్ వారి ఆధ్వర్యంలో సంగస్థులు స్థానిక చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ సమక్షంలో వెంట్రు సుధీర్ ని దుశ్శలువాతో సత్కరించి ఘనంగా సన్మానించినారు.. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ సోషల్ మీడియా అధికార ప్రతినిధి కాశి జ్యోతిబాబు, దొంతికుర్రు తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ న్యాయవాధి మోర్తా గాంధీబాబు, గెద్దనపల్లి వార్డు మెంబర్ సంసాని గంగాధర్, చెయ్యేరు వార్డు మెంబర్ పండు శ్రీను, స్థానిక సంఘ పెద్దలు గెడ్డం శ్రీను, స్థానిక చర్చ్ యూత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.