

కలెక్టర్,ఎమ్మెల్యే,సిసి వచ్చి సర్వే చేసిన త్రిబుల్ ఐటీ ఏమైంది.
మూడు జిల్లాలను కలిపేనడి చౌరస్తాలో కారు చీకట్లు.
హైమాక్స్ లైట్స్ ప్రారంభనికి నోచుకోని పరిస్థితి.
మండల సుందరీకరణ పనులు ముందుకు సాగడంలేదు.
బిజెపి పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.
జనం న్యూస్ 3 ఆగస్ట్ 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలొ విలేకరుల సమావేశము ఏర్పాటుచేసి అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ జోరు తగ్గింది బోరుకు వచ్చింది కాబోలు, ఎల్కతుర్తి మండల కేంద్రములో కూడలి నిర్మాణ పనులు వేగం తగ్గింది అని మండలంలో అభివృద్ది కార్యకలాపాల చురుకుతనం తగ్గి సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదని మూడు జిల్లాలను కలిపే నడి చౌరస్తాలో కారు చీకట్లు కమ్ముకున్నాయి, వున్న లైట్స్ తీసేసి అభివృద్ధి అని హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేసిన ప్రారంభనికి నోచుకోని పరిస్థితివుంది. చికట్లో ప్రజలు నాన ఇబ్బందులు పడుతూ తిరుగుతున్నారని, కనీసం మండలంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్లడానికి దారిని చూపించే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చెయ్యకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది గా మారిందని కొత్తగా ఈ దారిలో వచ్చేవాళ్ళు గమ్యం ఎటు వెళ్లాలో తెలియక సతమత మావుతున్నరని,సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో ఇంకా జాప్యం తో వర్షంవల్ల నీరు మొత్తం రోడ్ల మీదకు వచ్చి గ్రామ ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డ్రైనేజీలు తీసే క్రమంలో ధ్వంసమైన మంచినీటిని సప్లై చేసే పైపులు పగిలిపోయి ఎల్కతుర్తి గ్రామ ప్రజలు త్రాగునీటి కొరత కూడా ఎదుర్కొంటున్నారు, త్రిబుల్ ఐటీ కోసం మడిపల్లె దారిలో ఉన్న అసైన్ భూములను సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే కోసం కలెక్టర్,ఎమ్మెల్యే,సిసి వీళ్ళందరూ వచ్చి సర్వే చేసి భూసేకరణ చేసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు త్రిబుల్ ఐటీ ఊసే లేదు అసలు త్రిబుల్ ఐటీ ఎల్కతుర్తి మండలానికి వస్తుందా, త్రిబుల్ ఐటీ అందని ద్రాక్షేనా అని చింతలపల్లె గ్రామ ప్రజలు త్రిబుల్ ఐటీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని వాళ్లకు పని ఉపాధి కలుగుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మండలం కేంద్రం నుండి త్రిబుల్ఐటీ ఇంకా ఎక్కడికి తరలించారా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.నిరుద్యోగుల నుదుటున రాజివ్ యువ వికాసం పేరుతో పంగనామాలు, నిరుద్యోగులకు వ్యాపారం చేసుకోవడానికి రుణాలు ఇస్తామని ప్రతి ఒక్క నిరుద్యోగి వ్యాపారం చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులను యువ వికాసాన్ని మర్చిపోయింది. ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న చిరు వ్యాపారులకు కాంప్లెక్స్ కట్టిస్తామన్న మీ మాట ఇప్పటివరకు నెరవేరలేదు, చిరువ్యాపారాలు,కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రోడ్ల మీద బండ్లు పెట్టుకొని జీవనోపాధి వెల్లదిస్తున్నారు. ఎవరిని అడగాలో దిక్కుతోచని ప్రభుత్వ పరిపాలనలో బోరుణ విలపిస్తున్నారు. ఇది కూడా మీ కంటికి కనబడడం లేదా ఇప్పటికైనా వాళ్ళకి తగు న్యాయం చేసి కాంప్లెక్స్ కట్టించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తున్నాము. ఇప్పటికైనా మీరు ఎల్కతుర్తి అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒకవేళ దున్నపోతు మీద వాన పడినట్లు పాలకులు అభివృద్ధినీ మరచిన రోజు మేము ధర్నాలు చేసైన అభివృద్ధి సాధించుకుంటామని తెలియజేస్తున్నాం.పైరవీలు మానుకొని ప్రజాపాలన అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేలా చూడాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆడెపు శ్రీ వర్ధన్, కోడం రమేష్, మాజీ సర్పంచ్ కుడుతాడు రాజు, సుకిన్ సుధాకర్, శ్యాంసింగ్ సల్పాల కిరణ్,దేవా రావు, మన్తుర్తి తిరుపతి, బొక్కలపాటి కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.