Listen to this article

జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం,తుమ్మపాల లో డా” సిహెచ్.అనిల్ కుమార్ ఆధ్వర్యం లో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 86 పశువులకు గర్భకోస వ్యాధుల చికిత్సలు, 45 పెయ్యిలకు,100 మేకలకు నట్టల నివారణ మందులు,ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పాడి రైతులకు పంపిణీ చేయుట జరిగింది, ప్రభుత్వం ద్వారా పాడి రైతులకు లబ్ధి చేకురే వివిధ రకాల సంక్షేమ పథకాలకు కోసం, లాభదాయకమైన, ఆరోగ్యకరమైన పశుపోషణ మెలకువలను రైతులకు వివరించుట జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మపాల సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, ఎంపీటీసీ పి.కన్నరావు, మాజీ సర్పంచ్ కర్రి సన్యాసినాయుడు, నీటి సంఘం చైర్మన్ పీలా సీతారామ్, మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ చదరం కాశి విశ్వేశ్వర రావు, మిగిలిన గ్రామ పెద్దలు కూటమి నేతలు, పాడి రైతులు మరియు సిబ్బంది కుమారి,వెంకట్, సంతోష్ ,కిరణ్,కావ్య, గోపాల మిత్రులు రమణ,హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా సుమారుగా 68 మంది రైతులు లబ్ది పొందారు.//