Listen to this article

పార్వతీపురం మన్యం జిల్లా, ఆగస్ట్5, (రిపోర్టర్ ప్రభాకర్):

ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, గంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్కు వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల కు సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తూ వార్తలను అందించి నిత్యం ప్రజలతో ఉండే జర్నలిస్టులకు పింఛన్, ఇళ్ల స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.