Listen to this article

జనం న్యూస్,ఆగస్టు05 అచ్యుతాపురం:


పాత్రికేయులకు న్యాయబద్ధంగా అందాల్సిన సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బెజవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పిలుపు మేరకు అచ్యుతాపురం జర్నలిస్టులు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో డిటికు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలలని, ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు ఎంఎం శర్మ తదితర రిపోర్టర్లు పాల్గొన్నారు.