

జనం న్యూస్, ఆగస్టు 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జాగదేవపూర్ ఆపదలో అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్న గార్లపాటి శివారెడ్డి మంగళవారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు బునారి నరేందర్, వారం రోజుల క్రితం ఉరి వేసుకుని హాత్మహత్య చేసుకున్నాడు అతనికి ఒక్క పాప ఇద్దరు కుమారులు ఉన్నారు, కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది అని విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా పెన్ ఫహాడ్ మండలంలోని లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి శివారెడ్డి ,తిగుల్ గ్రామానికి వచ్చి స్థానిక పి ఎ సి ఎస్ (PACS ) డైరెక్టర్ కామల్ల భూమయ్య,తో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం కుటుంబం లో ఉన్న ఆడబిడ్డ పేరున రూ .20000/-వేల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గార్లపాటి శివారెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎవరు ఆపదలో ఉన్న వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని పేర్కొన్నారు.నేను సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య యూత్ నాయకులు మహేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ,మనోజ్, నిఖిల్ రెడ్డి, లోకేష్ ,పలువురు పాల్గొన్నారు.