Listen to this article

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసుకోవాలి.

జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్).

ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంల్లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మంగళవారం పైలట్ గ్రామాలైన, ఎల్కతుర్తి మండలం వీర నారాయణపూర్ లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.అదేవిధంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులు,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇల్లు మొదలు పెట్టని, బేస్మెంట్ వరకు వచ్చి ఆగిన ఇండ్ల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పైలెట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టి ఆరు నెలలు అవుతుందని, ఇంకా ఇండ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడం సరైంది కాదన్నారు. నిర్మాణ పనులు వేగంగా సాగాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ. 5 లక్షల ను మంజూరు చేస్తుందని, వివిధ దశలకు ప్రభుత్వం అందిస్తున్నందున లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. బేస్మెంట్ వరకు వచ్చిన ఇండ్ల నిర్మాణ పనులు మరింత ముందుకు సాగాలని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు అలాగే నిలిపివేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇండ్ల నిర్మాణ పనులు ముందుకు సాగకపోతే వాటిని క్యాన్సిల్ చేసి తదుపరి జాబితాలోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, ఎల్కతుర్తి తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో రవి,అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, వీరనారాయణపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్ రావు మండా సుమన్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.