

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల బి సి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం లో మార్కాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన తల్లి పాల వారోత్సవాలు ఘనంగ నిర్వహించారు ఈ సందర్బంగా సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయనిశిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. తల్లిపాలు బిడ్డ మానసిక, శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారుప్రతి పల్లెలోనూ తల్లిపాల ప్రాముఖ్యతపై చర్చ జరగాలన్నారు. పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ లక్ష్మి అంగన్వాడీ టీచర్స్ లలిత, నాసరమ్మా, సత్యనారాయణమ్మ, పద్మావతి, అచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు